Leading News Portal in Telugu

Flipkart Offers 2025: Samsung Galaxy S24 Gets Massive RS 40000 Discount, Best Deal Ever


  • ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ జాతర
  • శాంసంగ్‌ గెలాక్సీ S24పై భారీ తగ్గింపు
  • ప్రీమియం శాంసంగ్‌ ఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన అవకాశం

మీరు ప్రీమియం శాంసంగ్‌ ఫోన్ కొనాలని చూస్తున్నారా?’.. అయితే ఇదే సరైన అవకాశం. శాంసంగ్‌ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘గెలాక్సీ S24’పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇంత తగ్గింపును మీరు అస్సలు ఊహించలేరు. ఈ ఫోన్ ధర ఏకంగా రూ.38,000 తగ్గింది. అదనంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు ఈ ఫోన్‌ను మరింత తగ్గించనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌.. గెలాక్సీ ఎస్‌24పై ఉన్న ఆఫర్స్ ఏంటో చూద్దాం.

శాంసంగ్‌ గెలాక్సీ S24 ఫోన్ 2024 జనవరిలో రిలీజ్ అయింది. ఈ రెండేళ్లలో గెలాక్సీ ఎస్24పై ఈ స్థాయిలో డిస్కౌంట్‌ ప్రకటించడం ఇదే తొలిసారి. ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నవారికి, మరీ ముఖ్యంగా శాంసంగ్‌ బ్రాండ్ కోరుకునే వారు ఈ సేల్‌లో గెలాక్సీ ఎస్24ను పరిశీలించొచ్చు. గెలాక్సీ S24 ఫోన్ లాంచ్ సమయంలో 8GB+128GB వేరియెంట్ రూ.79,999గా.. 8GB+256GB వేరియెంట్ రూ.89,999గా ఉంది. 8GB+128GB మోడల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.47,999కు లిస్ట్ చేయబడింది. అంటే మీరు 36 శాతం తగ్గింపు పొందుతారు. సేల్ సమయంలో మరిన్ని డిస్కౌంట్లతో ఈ ఫోన్ ధర రూ.40,999కి తగ్గనుంది.

గెలాక్సీ ఎస్24 కొనుగోలు సమయంలో మీరు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే.. రూ.4,000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. దాంతో ఫోన్ ధర మరింత తగ్గనుంది. ప్రీమియం శాంసంగ్‌ ఫోన్‌లో ఇంత తగ్గింపు చాలా అరుదు అనే చెప్పాలి. దాదాపుగా మీరు 40 వేల డిస్కౌంట్ పొందనున్నారు. ఈ ధర కూడా ఎక్కువ అనుకుంటే.. ఆందళోన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.40,934 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ లభిస్తుంది.

గెలాక్సీ ఎస్‌24 ఫీచర్లు:
# 6.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్‌ రేట్‌
# ఎగ్జినోస్‌ 2400 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
# వెనుక భాగంలో 50MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ కెమెరా
# ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా
# 4,000mAh బ్యాటరీ, 25వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌