బెంగళూరు మార్కెట్లోకి హోండా అమేజ్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన ప్రీమియం కార్ల కేటగిరీలో ఆల్ న్యూ సెకెండ్ జనరేషన్ హోండా అమేజ్ కార్లను బెంగళూరులో లాంఛనంగా విడుదల చేసింది. కార్ల పరిశ్రమలలో ఇదే తొలిసారి హోండా అమేజ్ కార్లు డీజిల్ సివిటి టెక్నాలజీ కల్గివుండడం విశేషం.
వీటిని విడుదల చేసిన అనంతరం హోండా కార్స్ ఇండియా డైరెక్టర్ మకాటో హయోడా జోనల్ హెడ్ సెంథిల్ కుమార్ నటరాజ్ మీడియాతో మాట్లాడారు. నేటితరాన్ని విశేషంగా ఆకట్టుకొనే ఎన్నో ఫీచర్లను ఈ కార్లు కల్గివుంటాయన్నారు. 5 ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి లభిస్తాయన్నారు. మూడేళ్ళ అన్లిమిటెడ్ వారంటీ కూడా ఇదే మొదటిసారి హోండా అమేజ్ కార్లకు ఇస్తున్నట్లు చెప్పారు.