Leading News Portal in Telugu

రేపు హైదరాబాద్‌లో మిడ్‌నైట్‌ ట్రెజర్‌ హంట్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న హైదరాబాద్‌లో మిడ్‌నైట్‌ ట్రెజర్‌ హంట్‌ను నిర్వహించబోతుంది పెడల్‌ సంస్థ. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ ట్రెజర్‌ హంట్‌ చేస్తున్నామని ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. పర్యావరణ హితమైన రవాణా మార్గం గురించి నేటి తరానికి మరింతగా అవగాహన కల్పించే ప్రయత్నంలో ఈ హంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హంట్‌ను పూర్తి వినోదాత్మకంగా, ఆలోచనాత్మకంగా నిర్వహించబోతున్నామని జూమ్‌కార్‌ సీఈవో, కో-ఫౌండర్‌ గ్రెగ్‌ మోరాన్‌ తెలిపారు. ఈ హంట్‌లో పాల్గొనే వారు ఎవరి సైకిల్‌ వారే తెచ్చుకోవాలని చెబుతున్న నిర్వాహకులు విజేతలుగా నిలిచిన వారికి 16 వేల రూపాయల విలువైన సోల్‌ఫిట్‌ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను బహుమతిగా అందించనున్నామని, అవి కాకుండా మరెన్నో బహుమతులు కూడా అందించబోతున్నామన్నారు.