Leading News Portal in Telugu

కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే : హీరోయిన్‌

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో కనిపించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇరువూరు కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. తమపై వస్తున్న రూమర్స్‌పై నిధి అగర్వాల్‌ గురువారం స్పందించిది. తనకు రాహుల్‌ చాలా కాలం నుంచి తెలుసని నటి చెప్పింది. అంతేకాక తామిద్దరం డేటింగ్‌లో లేమని కూడా ఆమె స్పష్టం చేసింది.

‘ ఓను.. నేను, రాహుల్‌ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే. నాకు చాలా కాలం నుంచి అతను తెలుసు. రాహుల్‌ క్రికెటర్‌ కాకముందు, నేను హీరోయిన్‌ అవ్వకముందు నుంచే మా ఇద్దరికీ పరిచయం ఉంది. మేము బెంగళూరులో కలిసి చదువుకున్నాం అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు.’ అని నిధి అగర్వాల్‌ పేర్కొంది. అయితే ఈ డిన్నర్ విషయంపై ఇంతవరకూ రాహుల్‌ స్పందించలేదు.

ఐపీఎల్‌-11 సీజన్‌ కేఎల్‌ రాహుల్‌ కింగ్స్‌ ఎలెమన్‌ పంజాబ్‌ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. తన అద్బుత ప్రదర్శనతో రాహుల్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాక ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్‌ అఫ్‌ సెంచరీ బాది కొత్త రికార్డును నెలకొల్పాడు. నిధి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కూడా చేస్తున్నారు. నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.