Leading News Portal in Telugu

దక్షిణ కొరియాతో తెలంగాణ ఢీ

హైదరాబాద్‌ : ఆసియా క్రీడలకు సన్నాహకంగా దక్షిణ కొరియా, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్ల మధ్య జరిగే స్నేహపూర్వక కబడ్డీ చాంపియన్‌షిప్‌ నేటి నుంచి జరుగనుంది. భారత అమెచ్యూర్‌ కబడ్డీ సమాఖ్య, తెలంగాణ కబడ్డీ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో పురుషులు, మహిళల విభాగంలో 19వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. నేటి సాయంత్రం 5 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. కిషన్‌ రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సాంకేతిక డైరెక్టర్‌ ఇ. ప్రసాద్‌ రావు పాల్గొంటారు. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు–సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి.