ప్రభాస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన రాజమౌళి నిర్ణయం..
అదేంటి.. ప్రభాస్, రాజమౌళి మంచి ఫ్రెండ్స్ కదా.. మరి అలాంటప్పుడు రాజమౌళి చేసిన పనికి ప్రభాస్ తల పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు రాజమౌళి చేసిన ఓ పని మాత్రం ప్రభాస్‌ను మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యే ఉగాది కానుకగా తన సినిమా RRR మోషన్ పోస్టర్ విడుదల చేసాడు రాజమౌళి. అది అలా ట్రెండ్ అవుతుండగానే రామ్ చరణ్ బర్త్ డే రెండు రోజుల్లోనే వచ్చేసింది. దాంతో మార్చ్ 27న రామ్ చరణ్ టీజర్ విడుదల చేసాడు. దాంతో చాలా రోజులుగా ఈ సినిమా అప్ డేట్స్ కోసం అడుగుతున్న ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేసాడు రాజమౌళి.
ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమా లుక్ కోసం చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన సినిమా అప్ డేట్స్ ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకు పుష్ప అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. దాంతో ప్రభాస్ అభిమానులకు మరింత ఉడికిపోతుంది. రాజమౌళి, రామ్ చరణ్, బన్నీ ఇలా ప్రతీ ఒక్కరు తమ సినిమా అప్ డేట్స్ అంత బాగా ఇస్తున్నారు.. మరి నీ సినిమా గురించి ఏం చెప్పవా డార్లింగ్ అంటూ ప్రభాస్‌ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆయనకు నేరుగా అకౌంట్ లేదు కాబట్టి యూవీ క్రియేషన్స్‌తో ఆడుకుంటున్నారు. కొందరు వైలెంట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్లైతే ఏకంగా యూవీ క్రియేషన్స్‌ను బ్యాన్ చేయాలంటూ రచ్చ చేస్తున్నారు. తమ హీరో సినిమా అప్ డేట్స్ అస్సలు చెప్పడం లేదంటూ వాళ్లు గోల పెడుతున్నారు. ఏడాదిగా షూటింగ్ జరుగుతున్నా కూడా కనీసం ఇప్పటి వరకు ఒక్క ఫోటో లేదు.. ఫస్ట్ లుక్ లేదు.. టైటిల్ కూడా చెప్పలేదంటూ దర్శక నిర్మాతలపై విరుచుకుపడుతున్నారు.