Leading News Portal in Telugu

తాత ఏఎన్నాఆర్.. మామ నాగార్జునతో నటించి పెద్ద తప్పు చేశాను.. సుమంత్..

అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరో అయ్యారు. మధ్యలో హీరోగా కొన్ని ఫ్లాపులు రావడంతో అనుకున్నంత రేంజ్‌లో పైకి రాలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోసుమంత్ మాట్లాడుతూ.. తన తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో చేసిన సినిమాలు చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే.. తాను చిన మేనమామ నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేయడం తన సినీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకున్నారు.2001లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అవుంతుందని .. తనకు ముందే తెలుసన్నారు. ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని షూటింగ్ సమయంలోనే అనిపించింది. కానీ ఏమి చేయలేకపోయాను. ఈ సినిమాలో నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాల్లో స్నేహితులుగా నటించాడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదన్నారు. అంతేకాదు తెలుగులో ఈ స్క్రిప్ట్ అంతగా గొప్పగా వర్కౌట్ కాలేదన్నారు.

‘ప్నేహమంటే ఇదేరా’ సినిమా మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో సూర్య, విజయ్ హీరోలుగా మలయాళ వెర్షన్‌ డైరెక్ట్ చేసిన సిద్దిక్ అదే ‘ఫ్రెండ్స్’ టైటిల్‌తో రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టైంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో స్నేహితులుగా మా బంధాన్ని ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. ఆ విషయం తనకు షూటింగ్ చేస్తున్న సమయంలో అర్ధమైంది. కానీ బయటకు మాత్రం చెప్పలేకపోయాను. ఇక మావయ్య నాగార్జునతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానన్నారు.ఈ సినిమాలో అల్లుడైన నేను నాకు మేనమామ అయిన నాగార్జునను కొట్టేసీన్ ఉంటుంది. ఆ సన్నివేశం తీసేటపుడు నేను ఎంతో బాధపడ్డాను. ప్రేక్షకులు కూడా ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారని చెప్పుకొచ్చారు.అందుకే ఈ సినిమా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తాను.