Leading News Portal in Telugu

కరోనా విలయతాండవంక్రైమ్ట్రెండింగ్బిజినెస్బిజినెస్ ఐడియాఅంతర్జాతీయంఆరోగ్యంటెక్నాలజీWin 1 Lakh – MC PRO Contest హోమ్ » న్యూస్ » ఆంధ్రప్రదేశ్ ఏపీలో రక్తదాన శిబిరాలు బంద్… వారికి మినహాయింపు…

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం… ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రక్తదాన శిబిరాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. పలు సహాయ సంస్థలు, ఛారిటీ సంస్థల ద్వారా నిర్వహించబడే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి సమూహాల వల్ల వైరస్ వ్యాప్తి పెరగొచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో లాక్‌డౌన్‌ ముగిసే వరకు వీటిపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే…నిత్యం రక్తమార్పిడి అవసరమైన తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే రోగుల అవసరాలు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటును కల్పించింది. రోగుల రక్త మార్పిడి, చికిత్స కొరకు సంబంధిత ఆస్పత్రికి వెళ్లడానికి ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను పరిశీలించి అధికారులు తగిన చర్యలను చేపట్టనున్నారు. ప్రయాణం అనుమతి కోసం రక్త మార్పిడి అవసరం ఉందంటూ తెలిపే ఆధారాలు పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని పోలీసు అధికారులు పరిశీలించి రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించేందుకు వీలుగా వారికి పాసులను జారీ చేస్తారు. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని కొంతమేర కట్టడి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.