Leading News Portal in Telugu

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్…

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో విదేశీ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమాన సర్వీసులను సైతం గత నెలలోనే కేంద్రం నిలిపేసింది. దీంతో విమాన సర్వీసులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మే 3వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో… ఆ తరువాతైనా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయా లేక ఇందుకు మరింత సమయం పడుతుందా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దీనిపై కొంతమేర స్పష్టత ఇచ్చింది ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా. కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ మే 4 నుంచి మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి బుకింగ్స్‌ను జూన్ 1 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది. అయితే ఏయే నగరాలకు ముందుగా బుకింగ్స్ మొదలవుతాయనే అంశంపై మాత్రం ఎయిర్ ఇండియా క్లారిటీ ఇవ్వలేదు.