Manipur Violence: మణిపుర్‌లో ఇంకా చల్లారని హింస.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన కేంద్రం – Telugu News | Centre security boost as fresh violence erupts in manipur
మణిపుర్‌లో ఇంకా అల్లర్లు చల్లారలేవు. మళ్లీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా 10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద మణిపుర్‌కు తరలించింది. శనివారం రోజున బిష్ణుపుర్ జిల్లాలోని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్వాక్టా అనే ప్రాంతానికి చెందిన మెయిటీలుగా గుర్తించారు.
Aug 06, 2023 | 9:36 PM




