వాజ్‌పేయికి చంద్రబాబు పరామర్శ!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్య సమస్యలతో ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 17న) నీతిఆయోగ్ సమావేశానికి హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబునాయుడు నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లారు. అక్కడ వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి.. ఆయన కుటుంబసభ్యులు రంజన్ భట్టాచార్యను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Comments (0)
Add Comment