Leading News Portal in Telugu

Cross Fire With Purandeswari: టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. లైవ్ వీడియో – Telugu News | Purandeswari Exclusive Interview With Rajinikanth Cross Fire TV9 Live Video


Purandeswari Exclusive Interview: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినప్పటికీ.. ఏపీలో రాజకీయాలు తగ్గేదేలే అంటున్నాయి.. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ.. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు, టీడీపీతో ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వంతో సఖ్యత ఇలా ఎన్నో విషయాల గురించి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు.

Purandeswari Exclusive Interview: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినప్పటికీ.. ఏపీలో రాజకీయాలు తగ్గేదేలే అంటున్నాయి.. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ.. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు, టీడీపీతో ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వంతో సఖ్యత ఇలా ఎన్నో విషయాల గురించి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. క్రాస్‌ఫైర్‌ విత్‌ రజినీకాంత్‌ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అనేక అంశాలపై స్పందించారు. వైసీపీతో ఏపీలో కలహం.. ఢిల్లీలో మైత్రిలా ఉన్న బంధంపైనా కామెంట్‌ చేశారు. ఏపీ చేసిన అప్పులు పదిలక్షల కోట్ల పైచిలుకే అన్న బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.. తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. టీడీపీ రాసిన స్క్రిప్టే చదువుతున్నారు అన్న విమర్శలకు పురంధేశ్వరి కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీపై చేసిన విమర్శలను వైసీపీ విస్మరిస్తోందని.. తాను రెండు పార్టీల తప్పుడు విధానాలను తప్పుబట్టినట్లు చెప్పుకొచ్చారు. పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి… జనసేనతో పొత్తు ఉందని.. టీడీపీతో పొత్తులపై అధినాయకత్వమే చూసుకుంటుందంటూ వివరించారు. పురంధేశ్వరి ఇంకా ఏం మాట్లాడారో టీవీ9 క్రాస్‌ఫైర్‌ లైవ్‌ వీడియో చూడండి..