AP Politics: తమ్ముని వెంటే అన్నయ్య..! మధ్యలో టీడీపీ.. ‘చిరు’ వ్యాఖ్యలతో దూకుడు పెంచిన వైసీపీ.. – Telugu News | YSRCP increases verbal attack on Chiranjeevi and Pawan Kalyan as fans, Jana Sena Party, TDP support Chiru AP Politics
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు.. సార్.. అంటూ చిరు చేసిన కామెంట్స్ తో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయండి.. అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం రియాక్ట్ కావడంతో అటు టీడీపీ, ఇటు చిరంజీవి అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయలను హీటెక్కించాయి. ఈ హీట్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రాజకీయాల్లో ఎంట్రీ.. ఆ తర్వాత రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టిన చిరంజీవి.. మళ్లీ కొన్నేళ్లుగా సినిమాలకు మాత్రమే పూర్తిగా పరిమితమయ్యారు. రాజకీయాల ఊసేత్తకుండా ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న చిరంజీవి ఉన్నట్టుండి ఒక్కసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు.. సార్.. అంటూ చిరు చేసిన కామెంట్స్ తో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయండి.. అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం రియాక్ట్ కావడంతో అటు టీడీపీ, ఇటు చిరంజీవి అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదంతా పవన్ కల్యాణ్ కోసం అనే ఊహగానాలు కూడా మొదలయ్యాయి.
అయితే, బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్‌తో అసలు వివాదం మొదలైంది. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. ఒకప్పుడు సినీపరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు అమరావతి వచ్చి మరి జగన్ తో భేటీ అయ్యారు చిరంజీవి. ఆ తర్వాత ఎప్పుడూ ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఒక్కసారిగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలతో అధికార పార్టీ కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే చిరంజీవి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్న వైసీపీ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించింది. అసలు సినీ పరిశ్రమపై ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. అలాగని తమను గిల్లితే ఎదురుపడి మరి గిల్లుతామని కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు..
పవన్‌కు చిరు మద్దతు ఇస్తారా?
చిరంజీవి తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అయింది. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చిరంజీవి కామెంట్స్ చూస్తే ఆయన తమ్ముడు పవన్ తో జత కలుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. దీంతో పవన్ తో పాటు చిరంజీవిపైనా విమర్శల దాడి పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్.. చిరంజీవి కూడా పవన్ తో కలిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే మంత్రులు, మాజీ మంత్రులు సైతం చిరంజీవికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మున్ముందు ఇదే దూకుడును కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొత్తం వ్యవహారాలు బయటకు తీస్తున్నారు. అసలు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అంశం వస్తే చట్టంలో పెట్టేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ముందుగా నీతులు చెప్పుకోవాలని ఇద్దరికీ కలిపి కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. నిన్న మొన్నటివరకూ అన్నయ్య చిరంజీవిని చూసి నేర్చుకోవాలంటూ పవన్ కు బుద్ధులు చెప్పిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే చిరంజీవిపై ఫైర్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవికి మద్దతుగా అభిమానులు, జనసేన
చిరంజీవి వ్యాఖ్యల తర్వాత వైసీపీ ఎదురుదాడికి దిగడంతో మెగా అభిమానులు రంగంలోకి దిగారు. ఒకవైపు, చిరంజీవి అభిమానులు.. మరోవైపు జనసేన పార్టీ కూడా చిరంజీవికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. ఈ క్రమంలో నాగబాబు కూడా అన్నయ్యకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రాజకీయ చర్చ.. రచ్చగా మారింది. మొత్తానికి బ్రో సినిమా వివాదం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసింది. రాబోయే రోజుల్లో పవన్ వారాహి యాత్రతో ఈ వేడి మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..