Vande Bharat Express: తిరుపతి -సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. అసలు విషయం తెలిసి అధికారులు షాక్.. – Telugu News | Watch Video: Passenger Triggers Fire Alarm On Vande Bharat Express smoke ‘Bidi’ cabin
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు ఆందోళనకు గురిచేశాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి బయటకు వచ్చారు. రైల్లోని మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి పొగలను గుర్తించారు. తాగి పడేసిన బీడీ వల్లే మంటలు వచ్చాయని.. ఏరోసోల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ కారణంగా బోగీలో అలారం మోగిందని సిబ్బంది తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని.. ఈ ఘటనకు కారణం అని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా సుమారు గంటపాటు రైలును నిలిచిపోయింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ఆకతాయి చేసిన పని ఆందోళనకు గురిచేసింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టాయిలెట్‌లో ఫైర్ అలారం మోగింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రైలును నిలిపివేశారు. పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించి అక్కడి చేరుకుని ఆశ్చర్యపోయారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు ఆందోళనకు గురిచేశాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి బయటకు వచ్చారు. రైల్లోని మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి పొగలను గుర్తించారు. తాగి పడేసిన బీడీ వల్లే మంటలు వచ్చాయని.. ఏరోసోల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ కారణంగా బోగీలో అలారం మోగిందని సిబ్బంది తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని.. ఈ ఘటనకు కారణం అని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా సుమారు గంటపాటు రైలును నిలిచిపోయింది.
గూడూరు మీదుగా రైలు నంబరు 20702లోని సి-13 కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారి గుర్తించారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లోని విజయవాడ డివిజన్‌కు చెందిన ఒక అధికారి ఈ వివరాలను అందించారు. తిరుపతి నుంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు C-13 కోచ్‌లోని టాయిలెట్‌లోకి ప్రవేశించి బీడీ వెలిగించాడు. బీడీ వెలిగించిన వెంటనే టాయిలెట్‌లో ఉన్న ఏరోసోల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యింది. అలారం మోగడంతో ‘ఏరోసోల్’ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ మంటలను ఆర్పడానికి పౌడర్ లాంటి పొగను విడుదల చేసింది. దీని కారణంగా ఆ కంపార్ట్‌మెంట్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వారు కంపార్ట్‌మెంట్ లోపల అత్యవసర ఫోన్ కనెక్షన్‌తో రైలు గార్డుకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైలు సాయంత్రం 5 గంటలకు మనుబోలులో నిలివేశారు.
అలారం మోగడాన్ని ప్రమాదంగా భావించిన రైల్వే పోలీసులు అగ్నిమాపక యంత్రాలతో కంపార్ట్‌మెంట్‌కు చేరుకుని టాయిలెట్‌లో బీడీ తాగుతున్న ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చేందుకు కిటికీ అద్దాలను పగలగొట్టారు. అతడిని బయటకు తీసుకొచ్చి రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే చట్టం ప్రకారం తగిన చర్య కోసం నెల్లూరులో రైల్వే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బోగీలో పొగలు రావడాన్ని గమనించి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థంకాక రైలు నుంచి బయటకు వచ్చేందుకు ఒకరిని ఒకరు తోసుకుంటు బయటకు వచ్చారు. ఈ సమయంలో కొద్దిపాటు తొక్కిసలాట జరిగింది. అక్కడ రైలులోని పొగతో నిండిన క్యాబిన్ రైలు నుండి ప్రజలను ఖాళీ చేయడాన్ని చూడవచ్చు.
వందే భారత్ రైలులో పొగలు
గూడూరు – మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన.
రైలు టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు.#VandeBharat #VandeBharatExpress pic.twitter.com/Vl2tW65oph
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం