Pothula Sunitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలపై మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు.. పవన్ తన భార్యలకి ఇచ్చిన గౌరవం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. మహిళల పుట్టుకనే అవమానించిన చంద్రబాబును పట్టుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ పడే తాపత్రయాన్ని కాపు జాతి క్షమించదని హెచ్చరించారు. అసలు ప్రజాకోర్టు అంటే ఏంటో పవన్ కల్యాణ్‌కు తెలుసా? అని నిలదీశారు ఎమ్మెల్సీ పోతుల సునీత.
కాగా, జనసేన పార్టీ ప్రజాకోర్టు పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో వీర మహిళలతో సమావేశమైన పవన్ త్వరలోనే ప్రజాకోర్టు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఎవరైతే తప్పులు చేస్తారో.. ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద వీరికి శిక్ష పడాలి? రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది? అనే దానిపై కార్యక్రమం ఉంటుందన్నారు ప వన్.. తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని సూచించారు పవన్.. అటువంటి బాధ్యతలు తెలిసేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పించాలని పిలుపునిచ్చారు.. ఇక, వాలంటీచర్ వ్యవస్థపై, రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్న పవన్ కల్యాణ్‌కు అదే స్థాయిలో వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్న విషయం విదితమే.