Leading News Portal in Telugu

Peanut Stuck In Throat: గొంతులో ఇరుక్కున్న వేరుశనగ.. రెండేళ్ల చిన్నారి మృతి


Peanut Stuck In Throat: చిన్న పిల్లలకు ఏది దొరికితే అది నోట్లు పెట్టుకుంటారు.. పళ్లు రాకున్నా.. వాటిని నమిలే ప్రయత్నం చేస్తుంటారు.. అదే కొన్నిసార్లు వాళ్ల ప్రాణాల మీదకు తెస్తుంది.. గొంతులో చిన్న చిన్న గింజలు ఇరుక్కుపోయి చిన్నారులు ప్రాణాలు వదిలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది.. శ్రీ సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి నయనశ్రీ ప్రాణాలు విడిచింది. ఇంట్లో ఆడుకుంటూ.. ఆడుకుంటూ వేరుశనగ విత్తనం తినడానికి నోట్లో పెట్టుకున్న చిన్నారి.. దానిని మింగేందుకు ప్రయత్నం చేసింది.. అయితే, వేరు శనగ విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో.. ఊపిరాడక చిన్నారి నయనశ్రీ ఇబ్బంది పడింది.. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.. ఎందుకంటే అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. కర్ణాటక బాగేపల్లికి చెందిన హనుమంతు కుటుంబం.. శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్లచెరువులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది..