1. తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన. నేడు, రేపు 19న తేలికపాటి నుంచి మోస్తరు వానలు. ఈనెల 20న తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు.
2. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,400 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.76,200 లుగా ఉంది.
3. చంద్రయాన్-3లో నేడు కీలక ఘట్టం. మాడ్యులర్ నుంచి విడిపోనున్న ల్యాండర్. చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్-3. ఇప్పటికే నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్న మాడ్యులర్.
4. నేడు అంబేద్కర్ కొనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన. కొత్తపేట మధ్యాహ్నం బహిరంగ సభ. రాత్రి అమలాపురం చేరుకోనున్న చంద్రబాబు.
5. నేడు విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన. ఉదయం 10 గంటల నుంచి విశాఖ దసపల్లా హోటల్లో జనవాణి. ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడనున్న పవన్ కల్యాణ్.
6. విజయవాడ : నేడు రాజ్‌భవన్‌కు ఏపీ బీజేపీ నేతలు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పురంధేశ్వరి. కేంద్ర నుంచి వచ్చిన స్థానిక సంస్థల నిధులపై ఫిర్యాదు చేయనున్న నేతలు.
7. అమరావతి : అంగళ్లు దాడి ఘటనపై నేడు విచారణ. నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు.
8. నేటి నుంచి టీఎస్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్.
9. హైదరాబాద్ : నేడు మోకిలా ఫేజ్-2 ప్రీ బిడ్ మీటింగ్. ఈ నెల 23 నుంచి 29 వరకు ఆన్లైన్ వేలం ప్రక్రియ. 300 ప్లాట్లలో 98,975 గజాలు అమ్మకానికి సిద్ధం. చదరపు గజానికి రూ.25 వేలు కనీస ధరగా నిర్ణయం. మోకిలా ఫేజ్-1లో గజానికి అత్యధికంగా రూ.1.5 లక్షలు. అత్యల్పంగా గజానికి రూ.72 వేలు పలికిన ధర.
10. నేడు నిర్మల్‌కు ఈటల రాజేందర్. ఏలేటీ మహేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపనున్న ఈటల.