Leading News Portal in Telugu

Kakani Govardhan Reddy: జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా సేవల్ని అందిస్తున్నాం


Kakani Govardhan Reddy Interesting Comments On Sahakara Banks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పారదర్శకంగా సేవలను అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార సంఘాలను పటిష్టం చేస్తున్నామన్నారు. సీఎం జగన్ సహకార రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలోని 13 కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న కర్నూలు, కడప జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు.. ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైద్యనాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నాబార్డు కన్సల్టెన్సీ సంస్థ సిఫారసులను ఆమోదించి.. బ్యాంకులకు సీఎం జగన్ పెట్టుబడి అందించారన్నారు. అదే విధంగా.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కూడా ఆర్థికంగా పటిష్టం చేస్తామన్నారు.

China: ఎటు చూసినా ముసలోళ్లే.. గగ్గోలు పెడుతున్న డ్రాగన్ కంట్రీ

అంతకుముందు.. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్‌ జగన్ గెలుస్తారని, మళ్లీ సీఎం అవుతారని కాకాని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ అవమానకరంగా మాట్లాడుతున్నారని, వాలంటీర్లలో 70 శాతం ఉన్న మహిళల మనోభావాలను గాయపరుస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నాలుగు చోట్ల పోటీ చేసినా గెలవలేడంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలుసు కాబట్టే.. ఆయన పేరును కూడా సీఎం జగన్ ఉచ్ఛరించరని అన్నారు. పవన్ ప్యాకేజీలకు అమ్ముడు పోయే వ్యక్తి కాబట్టే ఆయన్ను దత్తపుత్రుడు అంటారని సెటైర్లు వేశారు.

Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు