Leading News Portal in Telugu

Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారేమో..!


Sajjala Ramakrishna Reddy: గవన్నరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత యార్లగడ్డ వెంకట్రావు.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఇదే సమయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు యార్లగడ్డ.. సజ్జల వ్యాఖ్యలు తనను బాధకు గురి చేశాయన్న ఆయన.. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారని.. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ధి చేశానన్నారు. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదు.. తడి గుడ్డతో గొంతు కోశారంటూ ఎమోషనల్‌ అయ్యారు యార్లగడ్డ.. అయితే, శుక్రవారం రోజు యార్లగడ్డ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.. యార్లగడ్డ వైసీపీ తరపు నుండి పోటీ చేశారు. పార్టీ కోసం పని చేయాలి తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి.. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది.. తనకు ఇబ్బంది ఉంటే వెంకట్రావ్ మిమ్మల్ని కలిసి ఉండాల్సింది.. ఇటువంటి అంశాల పై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ, బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మేం అందరం అందుబాటులో ఉండే నాయకులమే.. బహిరంగ ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదన్న ఆయన.. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని ఆరోపించారు.

అయితే, పోతే పో అని నేనట్లు మీడియా వక్రీకరించి రాసిందన్నారు సజ్జల.. అలా నేనెందుకు అంటాను? అని ప్రశ్నించిన ఆయన.. నేనే కాదు మా పార్టీలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నాయకులంటే ఇంట్లో పని చేసే వారా అలా అనటానికి? యార్లగడ్డ.. టీడీపీతో కాంటాక్ట్ లో ఉన్నారని ఎవరూ అనలేదని స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు రాశారేమో అన్నారు. అతనికి భవిష్యత్తు ఉంటుందని నాలాంటి వాళ్లు చెప్పారన్నారు సజ్జల. సీఎం వైఎస్‌ జగన్‌ని కలవాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు.. తనతో పాటు చాలా మంది వైసీపీకి రాజీనామా చేస్తారని పేర్కొన్నారు.. అంతే కాదు.. వైఎస్‌ జగన్‌ను కలవడానికి అవకాశం దొరకడం లేదన్నారు. కడప నుంచి ఆయన గెలుస్తాడు.. గన్నవరం నుంచి నేను గెలిచి అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ను కలుస్తానంటూ యార్లగడ్డ వెంకట్రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.