Minister Gudivada Amarnath: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్న విషయం విదితమే.. అయితే, అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క.. అన్న ఆయన.. ఎవరి మాటలో నమ్మి నన్ను దూరం చేసుకోవద్దు అని సూచించారు. ఈ సారి అనకాపల్లి నుంచే పోటీ చేస్తా.. నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యత మీదే అన్నారు. ఐదు నెలల కష్టపడితే మళ్లీ ఐదేళ్ల అధికారం మనదేనన్న ఆయన.. ప్రాణం పోయినా అవినీతికి పాల్పడను అన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల సమావేశంలో వివిధ అంశాలపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
మరోవైపు.. చెప్పిన పని చేశాకే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను.. పని చేయకపోతే మీరు నాకు ఓటేయకండి.. అంటూ గతంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మూలపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దృష్టికి స్థానిక సమస్యలను తీసుకెళ్లారు ప్రజలు.. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి.. దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. గత ప్రభుత్వాలు గ్రామ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, గ్రామస్తుల మొర వినలేదని దీని ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయని విమర్శించిన విషయం విదితమే..