Leading News Portal in Telugu

Jyothi Surekha: భారత ఏస్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖకు సీఎం అభినందనలు


Jyothi Surekha: భారత ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ణు కలిశారు జ్యోతి సురేఖ.. ఇటీవల బెర్లిన్‌ లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను సీఎం అభినందించారు.. ఇక, ఈ సందర్భంగా తాను సాధించిన పతకాలను సీఎం వైఎస్‌ జగన్‌కు చూపించారు సురేఖ.. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై సురేఖను ప్రశంసించారు సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు.. జ్యోతి సురేఖకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వగా.. తనకు పోస్టింగ్‌ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు సురేఖ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాక్షించారు.