Leading News Portal in Telugu

Gannavaram politics: గన్నవరంపై వైసీపీ హైకమాండ్‌ ఫోకస్‌.. వారిని బుజ్జగించే ప్రయత్నం..!


Gannavaram politics: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం గన్నవరం అసెంబ్లీపై మరోసారి ఫోకస్‌ పెట్టింది.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్‌.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు.. దీంతో.. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, అప్పటికే ఉన్న దుట్టా రామచంద్ర రావు. ఇలా వైసీపీలో అంతర్గత విభేదాలు కొన్నిసార్లు బహిర్గతం అయ్యాయి.. అలా గన్నవరం పాలిటిక్స్‌ ఎప్పటికప్పుడు గరంగరంగానే మారిపోయాయి.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. వైసీపీ టికెట్‌ ఆశించిన యార్లగడ్డ.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దీంతో.. గన్నవరంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది వైసీపీ హైకమాండ్‌.

గన్నవరం సెగ్మెంట్ పై ఫోకస్‌పెట్టిన వైసీపీ.. నష్ట నివారణ కసరత్తు ప్రారంభించింది.. అందులో భాగంగా.. ఎంపీ బాలశౌరిని రంగంలోకి దించింది.. ఆయన రేపు గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావుతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.. గన్నవరం టికెట్ ఆశించిన యార్లగడ్డ వెంకట్రావ్ టీడీపీలో చేరటంతో.. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై దృష్టిసారించిన పార్టీ హైకమాండ్.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విబేధిస్తున్న దుట్టా వర్గాన్ని ఆయనకు దగ్గర చేసే విధంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దుట్టా రామచంద్రరావుతో ఎంపీ బాలశౌరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో వైనాట్‌ 175 అంటూ ముందుకు సాగుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వివిధ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించిన పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మనమంతా కలిసి పనిచేస్తే అది పెద్ద సమస్యే కాదని తెలిపిన విషయం విదితమే.