Leading News Portal in Telugu

Peddireddy Ramachandra Reddy: ఏపీలో కంచుకోట లేమి లేవు.. రాష్ట్రమంతా సీఎం జగన్‌ కంచుకోటే..


Peddireddy Ramachandra Reddy: సర్వ సాధారణంగా ఒక్కో నియోజకవర్గం.. ఒక్కొక్కరి కంచుకోట అని చెబుతుంటారు.. కొందరు నేతలు ఎక్కువ పర్యాయాలు పోటీ చేసి.. క్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోతే.. అది కంచుకోట.. వారిని ఓడించడం కష్టమనే నిర్ణయానికి వస్తాయి ప్రత్యర్థి పార్టీలు.. అయితే, కంచుకోటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టి పెట్టకా రాష్ట్రంలోని పంచాయితీలు, స్థానిక సంస్థలు గెలిచాం.. చంద్రబాబు కుప్పంలో అనేక పర్యాయాలు పోటీ చేశారు.. కానీ, కుప్పంలో రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీటు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. కుప్పంతో పోలిస్తే ఇక్కడ అంతకంటే బలమైనవారులేరన్న ఆయన.. రాష్ట్రంలో కంచుకోటలు ఏమి లేవు.. రాష్ట్రమంతా సీఎం వైఎస్‌ జగన్‌ కంచుకోటే అని అభివర్ణించారు.

సంక్షేమ పథకాలు అందించడం వలన కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కరోనా సమయంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇక, హిందూపూర్ లో దీపిక విజయం కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అందరూ కృషి చేస్తారు.. అందరూ కష్టపడి పని చేసి విజయం సాదించాలని స్పష్టం చేశారు. ఎన్నికల లోపు కనీసం రెండు మూడు సార్లు సీఎం జగన్‌ను హిందూపూర్ లో పర్యటించాలని కోరనున్నట్టు పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.