Leading News Portal in Telugu

CPM Srinivasa Rao : జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారు


భారత్ మాలా పేరుతో అత్యధికంగా భూములు తీసుకుంటున్నారని, ఏమాత్రం చట్టబద్ధమైన ప్రాతిపదిక లేని అదానీ అనుబంధ సంస్ధలకు భారత్ మాలా ను అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఎకరాకు కోటి నలభై లక్షలు రావాల్సి ఉండగా ముప్పై లక్షలు ఇస్తున్నారని ఆయన ధ్వజమజెత్తారు. భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బేరసారాలు చేసి భూములు లాక్కుంటున్నారని, రైతులు, వ్యవసాయ కూలీలను కూడగట్టి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. కాగ్ కూడా భారత్ మాలా కుంభకోణాన్ని ఎత్తి చూపిందని, రైతుల భూములని రియాల్టర్లకు, కార్పొరేట్ కంపెనీపకు కట్టబెడుతున్నారని ఆయన అన్నారు.

ఈ నెల 30 నుంచీ సెప్టెంబర్ 4 వరకూ రాష్ట్ర వ్యాప్త క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ధరలు తగ్గించాలి, ఉద్యోగాలు కావాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి అంటూ క్యాంపైన్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 4న ధర్నాలు చేస్తాం… ఈనెల 5న తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని, ప్రీపైడ్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు.. దాంతో ప్రజలు కరెంటు వాడుకోవక్కర్లేదన్నారు. ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేయాలి.. ఎప్పుడో ఎవరో వాడుకున్న దానికి ఇప్పుడు ఎందుకు ఛార్జీలు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ఆగష్టు 28న విద్యుత్ అమర వీరుల దినోత్సవం జరుపుకోబోతున్నామని శ్రీనివాసరావు తెలిపారు.