శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చేనెల సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రయాన్ 3 విజయంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మంత్రి కొట్టు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు జగన్ ని ఎదుర్కోలేక అందరూ ఒక్కటే దొంగ ఓట్ల తొలగింపు గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో వుండి లక్ష కోట్లు దోచి సింగపూర్ తరలించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. సింగపూర్ లో బినామీ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రభుత్వం బినామీని అరెస్టు చేసింది నెక్స్ట్ అరెస్ట్ చంద్రబాబే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకుని ఏమి చెబితే అది చెప్పడం పవన్ కు అలవాటు అని ఆయన విమర్శలు గుప్పించారు. విశాఖ ఋషికొండలో ప్రభుత్వ భవనాలు కడుతున్నారు అవి ప్రైవేటువి కాదని మంత్రి కొట్టు వెల్లడించారు. చంద్రబాబు హయాంలో గీతం యూనివర్సిటీకి రామానాయుడు స్టూడియోకి ఎవరు స్థలాలు కేటాయించారని ఆయన అన్నారు. లోకేష్ పాదయాత్ర యువగళం కాదు గందరగోళం కొడాలి నాని విమర్శించడం కాదు దమ్ముంటే నాని మీద పోటీ చేయడానికి లోకేష్ ని రమ్మనండని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేషనల్ పార్టీ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా డబల్ స్టాండ్ గా మాట్లాడుతుందని ఆయన ధ్వజమెత్తారు. కర్నూలు, విశాఖ రాజధాని ఉండాలని వాళ్లే అంటారు మళ్లీ ఇప్పుడు అమరావతి రాజధాని బీజేపీనే అంటుందన్నారు. పవన్ జనసేన పార్టీకి స్టాండ్ లేదు చంద్రబాబుకు అద్దెకిచ్చే పార్టీల ఉంటే విలువ ఎక్కడ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.