ఈ నెల 28 న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. చంద్రబాబు, నుండి ఆనంద్ బాబు వరకు దొంగ ఓట్ల మాట ఎత్తితే వణికిపోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. దొంగ ఓట్ల తో గెలవాలని చూస్తే ప్రజా స్వామ్యం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదని, అందుకే పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అభివృద్ధి రధ చక్రాల కింద టిడిపి నలిగి పోవడం ఖాయమని ఆయన వెల్లడించారుఉ. చంద్రబాబు కుయుక్తులను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ ఎస్సీ,ఎస్టీ, బీసీ ,నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తపన పడుతున్న సీఎం జగన్ …. ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి పైసా పేద వాడి తలుపు తడుతుంది…. ఈ రాష్ట్రానికి జగన్ పరిపాలన,నాయకత్వం అవసరం అని ప్రజలు నమ్ముతున్నారు… అందుకే మళ్ళీ వైసీపీ కి పట్టం కట్ట డానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు…. టీడీపీ అధినాయకుడు తో సహా నాయకుల ఆలోచనలు వెర్రి తలలు వేస్తున్నాయి… సీఎం జగన్ పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…. పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన లో వేలకోట్లు దోచుకున్నారు… సంపాదన ధ్యేయంగా మళ్ళీ అధికారం లోకి రావాలని తహ తహ లాడుతున్నారు…. ఓట్ల వ్యవహారం తప్పుల తడక లా ఉంది… ఎన్నికల కమీషన్ సిఫార్సుల మేరకు తప్పుడు ఓట్లు తీసివేయాలి, అని అధికారులు ప్రయత్నిస్తుంటే టిడిపి నాయకులు ఉలిక్కి పడుతున్నారు…. దొంగ ఓట్ల తో గెలిచే చరిత్ర టిడిపి ది… రాష్ట్రం లో దొంగ ఓట్ల తో గెలవడం కుప్పం లోనే మొదలయ్యింది…’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.