విశాఖపట్నంలో ఇటీవల అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీసాహా కేసు సంచలనం రేపుతోంది. రితీసాహా మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు త్వరలో నగరానికి రానున్నట్టు సమాచారం. రేపో, ఎల్లుడో దీనిపై స్పష్టతరానుంది. వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసు పై మమతా బెనర్జీ ప్రభుత్వం సీరియస్ ఉంది. గత నెల 14వ తేదీన భవనం పై నుంచి కింద పడి రితీసాహా మృతి చెందింది. విశాఖ పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక తల్లి దండ్రులు. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకున్నారు అని ఆరోపించారు రితీసాహా తల్లిదండ్రులు.
ఆరోపణలకి బలం చేకూరేలాగా సీసీ ఫుటేజ్ లో లొసుగులు, ఫోర్త్ టౌన్ సీ.ఐపై బదిలీ వేటు పండింది. దీంతో.. ఫోర్త్ టౌన్ పోలీసులను విచారించనున్న సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి ముగ్గురు కారులో వచ్చి డీల్ సెటిల్ చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేసిన విశాఖ పోలీసులు… తల్లిదండ్రుల ఆరోపిస్తున్న కారులో ముగ్గురు వ్యక్తుల సీసీటీవీ ఫుటేజ్ ఏమైనట్టు..? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు బాధితులు… భారీ మొత్తంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు అనుమానం ఉందని, ఎస్.ఐ నుంచి సీ.ఐ కి వరకే చేతులు మారిందా.. ఇంకెవరైనా పోలీస్ అధికారులు, పెద్ద తలకాయలు హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. విశాఖ పోలీసులకు ఉచ్చు బిగుసుకుంటోంది.