Leading News Portal in Telugu

AP-Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..!


AP-Telangana: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని, వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కానీ భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Read also: Patnam Mahendar Reddy: నేడే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఏశాఖ ఇవ్వనున్నారు?

ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 89.6, జియ్యమ్మవలసలో 69.2, అనకాపల్లి జిల్లా చోడవరంలో 48.6, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 45, విజయనగరం జిల్లా డెంకాడలో 43.4, పశ్చిమగోదావరి 4 జిల్లా తాడేపల్లిగూడెంలో 43.2, పశ్చిమగోదావరి 4 జిల్లా తాడేపల్లిగూడెంలో 43.2. పార్వతీపురం మన్యం జిల్లా గరుబిల్లిలో 39.8, విజయనగరం జిల్లా కురుపాంలో 27.2, మేరముడియంలో 26.2, ఏలూరు జిల్లా పోలవరంలో 24.6, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Patnam Mahendar Reddy: నేడే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఏశాఖ ఇవ్వనున్నారు?