RK Selvamani: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది చెన్నై కోర్టు.. 2016లో చెన్నైలో ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు సెల్వమణి.. ఆ ఇంటర్వూయే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.. ఎందుకంటే.. ఆ ఇంటర్వ్యూలో తనను కించపర్చేలా మాట్లాడారంటూ సెల్వమణిపై సినీ ఫైనాన్షియర్.. సెల్వమణిపై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా కేసు వేశారు.. ఇక, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది జార్జిటౌన్ కోర్టు.. మరి.. సెల్వమణి ఈ అరెస్ట్ వారెంట్‌ను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.