Leading News Portal in Telugu

Document writers: ఆందోళనకు సిద్ధమైన డాక్యుమెంట్ రైటర్స్.. రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం..?


Document writers: ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు డాక్యుమెంట్‌ రైటర్స్.. రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ అమలుపై నిరసనకు దిగనున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు పెన్ డౌన్ ద్వారా నిరసన తెలపాలని డాక్యుమెంట్‌ రైటర్స్‌ కు సంబంధించిన ఓ అసిసోయేషన్‌ నిర్ణయించింది.. అయితే, ఈ 2 రోజుల నిరసనకు దూరంగా ఉంటున్నట్టు మరో అసోసియేషన్ పేర్కొంది.. వచ్చే నెల అంటే సెప్టెంబర్‌ 3వ తేదీన సమావేశమై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెబుతున్నారు రెండో అసోసియేషన్ నేతలు.. మరోవైపు.. కొత్త సాఫ్ట్‌వేర్‌ వల్ల డాక్యుమెంట్ రైటర్స్ కి ఏ ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఇలా ఎలా ఉన్నా.. డాక్యుమెంట్‌ రైటర్స్‌లోని అసోసియేషన్లలో విబేధాల నేపథ్యంలో.. వారి నిరసన కార్యక్రమం రెండు రోజుల పాటు ఎలా కొనసాగుతుంది.. మిర వారి ఆందోళన ప్రభావం రిజిస్ట్రేషన్లపై ఏ స్థాయిలో పడుతుందో వేచిచూడాల్సిన అవసరం ఉంది.