Leading News Portal in Telugu

CM YS Jagan: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. చిన్నారి వైద్యానికి భారీ సాయం..


CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.. ఆపద ఉంది..! ఆదుకోండి అంటూ తన దగ్గరకు వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచారు.. వారి ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న చిన్నారి ప్రాణాలను కాపాడేందేకు ఏకంగా రూ.41.50 లక్షలు మంజూరు చేయించారు.. ఈ నెల 11న అమలాపురం పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ను కలిసి.. బాధిత కుటుంబసభ్యులు తమ గోడు వెల్లిబుచ్చుకోగా.. ఆదుకుంటానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించిన నిధులను మంజూ చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. దీనిపై వైద్యులను సంప్రదించారు బాలిక తల్లిదండ్రులు.. అక్కడే వారికి ఊహించలేని విషయం తెలిసిందే.. ఆ చిన్నారి బ్రెయిన్‌ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. అయితే, చికిత్స చేయించడానికి రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పడంతో.. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో.. బిడ్డకు చికిత్స ఎలా చేయించాలో తెలియక ఆర్థిక స్తోమత లేని తండ్రి రాంబాబు గుండెలుపగిలేనా రోధించాడు.. ఇదే సమయంలో.. సీఎం జగన్‌ ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వెళ్లారు.. మంత్రి పినిపే విశ్వరూప్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తన బిడ్డ సమస్యను తీసుకెళ్లాడు రాంబాబు.. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్‌.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. అయితే, ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్‌ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.. చికిత్స చేయించుకుని ఆ చిన్నారి పూర్తి అనారోగ్యంతో రావాలని ఆకాక్షించారు.