ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి కోరుతూ.. ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఏసెన్షల్ సర్వీస్ లో ఉంటారని వారికి ఎస్మా వర్తిస్తుందన్న ప్రభుత్వం తరుపు న్యాయవాది వెల్లడించారు. ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు 1000 మందితో ధర్నాకు అనుమతి కోరారు. న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని తమ వాదనలు న్యాయవాది మాధవరావు వినిపించారు. శాంతి భద్రతల సాకుతో పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారన్న పిటిషనర్స్ తెలిపారు. 500 మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించండని ఉద్యోగులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఎల్లుండికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.