సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కేడర్ కు సూచించారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేయాలని, రెల్లి కాలనీల్లో పవన్ బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయాలని, పేద విద్యార్థుల హాస్టళ్లను సందర్శించి పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులు అందించాలని, దివ్యాంగులకు ఉపకరణాలను సాయం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మనోహర్…..సేవా కార్యక్రమాల వివరాలను అందించారు..ముఖ్యంగా ఐదు రకాల సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి ఉపయోగపడాలన్నారు.సెప్టెంబర్ రెండో తేదీ శనివారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మెగా రక్తదానశిబిరం నిర్వహించనున్నారు…పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మనోహర్ సూచించారు…నాదెండ్ల మనోహర్ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనున్నారు.ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.