Leading News Portal in Telugu

Gurukula Students: అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు.. 30 మందిలో ఏపీ నుంచే ఐదుగురు


Gurukula Students: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులకు అవకాశం రాగా.. ఐదుగురు ఏపీ విద్యార్ధులకు చోటు దక్కింది. ఎంపికైన ఐదుగురు కూడా సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్ధులే కావడం గమనార్హం. ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ సొసైటీకి చెందిన విద్యార్ధులు సీఎం వైఎస్‌ జగన్‌ను ఇవాళ కలిశారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, విద్యా వివరాలు ఒక్కొక్కరినీ అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. యూఎస్‌ఏలో చదువులు పూర్తయి వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు.

గత ఏడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని ఇద్దరు విద్యార్థులు తిరిగి వచ్చారు. ఆ ఇద్దరు విద్యార్థులు సీఎం జగన్‌ను కలిశారు. వారితో మాట్లాడి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఒక్కో విద్యార్ధికి ప్రోత్సాహకంగా రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. వారికి శాంసంగ్ ట్యాహ్ అందజేశారు. విద్యార్థులు డి.నవీన, ఎస్‌.జ్ఙానేశ్వరరావు, రోడా ఇవాంజిల్, బి.హాసిని, సీహెచ్‌.ఆకాంక్ష, కె.అక్ష, సి.తేజ సీఎంను కలిశారు.