Leading News Portal in Telugu

Supreme Court: ఆర్-5 జోన్ కేసును నవంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు


ఆర్‌-5 జోన్‌‌పై సుప్రీంకోర్టులో నేడు (శుక్రవారం) విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ఈ క్రమంలో ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రతివాదులకు రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను నవంబర్‌కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని గతంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో పలు అంశాలు ముడిపడి ఉన్నాయన్న సుప్రీంకోర్టు పేర్కొంది.