Leading News Portal in Telugu

Minister Amarnath: అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు…


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన విమర్శించారు. అవినీతి వ్యవహారాల్లో కాపాడమని కాళ్ళు మొక్కడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్ర మొదలు పెట్టాడు అని మంత్రి అన్నారు. వంద రూపాయలు నాణెం విడుదలలో చంద్రబాబు కూర్చున్న సీటే ఆయన స్థాయిని చెప్పేసింది అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

హెరిటేజ్ వ్యాపారం వల్లే లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగారో చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పిండింది అవుపాలో గేదే పాలో కాదు రాష్ట్ర ఖాజానాను.. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల రూపంలో కోట్లు కొల్లగొట్టారు అంటూ ఆయన విమర్శలు సంధించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలి.. ఆయన పీఏ శ్రీనివాసే మొత్తం చిట్టా బయట పెట్టాడు అని మంత్రి అమర్నాథ్ అన్నారు.

2024 ఎన్నికలకు వంటరీగా వెళతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2019 నాటి ఫలితాలతో తిరిగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు భాష ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చేంత సంస్కారంగా లేవు.. ఆయన ప్రవర్తనను బట్టే ప్రభుత్వం రియాక్షన్ ఉంటుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎవరు తప్పు చేసిన మా ప్రభుత్వం విడిచి పెట్టడదని మంత్రి పేర్కొన్నారు.