Vijayawada Crime: విజయవాడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. అసహజ శృంగారం కోసం ఒత్తిడి చేస్తున్నాడని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు మైనర్లు.. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఘోర పార్కులో తాగిన మైకంలో.. అక్కడే ఉన్న మైనర్లపై అసహజ లైంగిక దాడికి ప్రయత్నించాడో వ్యక్తి.. లైంగికంగా అనేకరకాలుగా తమను ఇబ్బంది పెడుతున్నాడని.. తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు ఇద్దరు మైనర్లు. అక్కడి నుంచి పరారయ్యారు.. అయితే, గత నెల 30వ తేదీన ఘోర పార్క్ లో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు పోలీసులు.. మృతుడి శరీరంపై రక్తపు గాయాలతో ఉండడంతో దర్యాప్తును సవాల్‌గా తీసుకున్నారు..
అయితే, పోలీసుల విచారణలో అసలు వ్యవహారం బయటపడింది.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తమపై అనేక రకాలుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పెట్టడంతో.. తట్టుకోలేక కర్రలతో కొట్టి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో ఆ ఇద్దరు మైనర్లు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, హత్యకు గురైన వ్యక్తి ఎవురు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న గవర్నర్ పేట పోలీసులు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.