Leading News Portal in Telugu

Vijayawada Crime: బెజవాడలో బెడిసికొట్టిన ప్రేమ.. యువకుడిపై కతిత్తో యువతి తల్లి దాడి


Vijayawada Crime: చాలా మంది ప్రేమించుకుంటారు.. కొందరు పెద్దలను ఒప్పించి.. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపిస్తారు.. మరికొందరు పెద్దలు ఒప్పుకోక పోవడంతో.. త్యాగాలు చేస్తారు.. మరికొందరు దూరంగా వెళ్లిపోతారు. అయితే, బెజవాడలో ఓ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది.. నాగరాజు అనే యువకుడిపై కత్తితో దాడి చేసింది ప్రేమికురాలు తల్లి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో నాగరాజు అనే యువకుడు.. ఓ యువతి ప్రేమలో పడ్డారు.. కొన్నాళ్ల ఈ వ్యవహారం బాగానే నడిచినా.. ఆ తర్వాత దూరంగా ఉండాలని నాగరాజుకు సూచించింది యువతి.. అయితే, దీనికి నాగరాజు నిరాకరించాడు.. యువతి వద్దని చెప్పిన తర్వాత కూడా అతని తీరు మారలేదు. మరోవైపు.. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఫోన్‌లో పెట్టిన మెసేజ్‌లు, కలిసి దిగిన ఫొటోలు.. వెంటనే డిలీట్‌ చేయాలని సదరు యువకుడిని కోరింది ఆ యువతి.. దాని కూడా నాగరాజు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి తల్లి.. అతడి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.