Leading News Portal in Telugu

Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబు ప్రేమ ఇందుకు చూపించాడా..!


రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక బిల్డింగ్ లు కట్టి వందల కోట్ల రూపాయలను కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునే వారో అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదిక ఈ పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతిలో షెడ్ల లాంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందల కోట్లు కొట్టేశారంటే.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు కట్టివుంటే లక్షల కోట్ల రూపాయల ముడుపులు తీసుకునేవారేమోనంటూ టీడీపీ అధినేతను ఉద్ధేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే నంటూ ఆయన చురకలు అంటించారు.

అయితే, ఇటివల ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీటిపై చంద్రబాబు ఎలాంటి వాదనకు దిగుతారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేవారు. ఈ మేరకు ట్వీట్‌లో.. చంద్రబాబు రూ.118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు వస్తాయి.. ఏముంది.. బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది.. కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా? 2G స్కాం కేసు ఏమైంది? వాటితో పోలిస్తే ఇదెంత? అనే విధంగా తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు అని దీనిపై కూడా చంద్రబాబు ఎదురుదాడికి దిగుతాడు వేచి చూడండని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Vj

Vj