చంద్రబాబు దొంగని రాష్ట్ర ప్రజలకు తెలుసు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రతీసారీ తప్పించుకుని పోతున్నాడు.. ఏదో రకంగా కోర్టులను మేనేజ్ చేసుకుంటూ మనుగడ సాగించాడు.. ఇవాళ దొంగ దొరికాడు.. ముందు నుంచి మేము ఏదైతే చంద్రబాబు గురించి చెబుతున్నామో అదే నిజమని తేలింది.. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం అని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఆదారాలతోనే ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. తనపై వచ్చిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
అమరావతి కోసం తన అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలను చంద్రబాబు తీసుకున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేష్ పాత్ర కూడా స్పష్టంగా ఉంది.. జమీలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇక, టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి దళితుల కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు.. వైవీపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. మాలాంటి చాలా మంది వైవీ ప్రోత్సాహం వల్లే ఈ స్థితిలో ఉన్నామని మంత్రి తెలిపారు. వైసీపీ నాయకులను దళిత వర్గాలకు దూరం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ జగన్ వెంటే ఉన్నారు.. మేమంతా వైఎస్ కుటుంబానికి వీర విధేయులం, వారికి అండగా ఉంటామని ఆయన చెప్పారు.