Leading News Portal in Telugu

Mahanandi Temple: మహానంది ఆలయంలో అపచారం.. క్షేత్రంలో సిబ్బంది, భక్తుల మధ్య ఘర్షణ


Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. క్షేత్రంలోనే ఘర్షణ పడి భక్తులు, దేవస్థానం సిబ్బంది కొట్టుకున్నారు. అనంతపురం జిల్లా నార్పల నుండి దర్శనానికి 20 మంది భక్తులు రాగా.. సంధ్య వేళ మహా మంగళ హారతుల దర్శనానికి రూ. 150 ఫీజు చెల్లించడానికి భక్తులు నిరాకరించారు. ఫీజు చెల్లించనిదే ఆలయంలోకి వెళ్లనివ్వమని సిబ్బంది అడ్డుకున్నారు.

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా.. ఘర్షణ పడి ఆలయ సిబ్బంది, భక్తులు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత చెలరేగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. పోలీసులకు ఆలయ సిబ్బంది ఫోన్‌ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. భక్తులకు, ఆలయ సిబ్బందికి పోలీసులు సర్ది చెప్పారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.