Leading News Portal in Telugu

YV Subba Reddy: ‘జమిలి’యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!


YV Subba Reddy: ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. మరోవైపు జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైవీ సుబ్బారెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడూ వచ్చినా వైసీపీ సిద్ధం.. గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు.. ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక, చంద్రబాబు 23 మందిని గతంలో టీడీపీలో కలుపుకుని ఝలక్‌ తిన్నాడు.. మళ్లీ ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఛాల్సే లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, చంద్రబాబుకు ఝలక్‌లు మాత్రం అలవాటే అని సెటైర్లు వేవారు. మరోవైపు.. ఇండియా పేరుని భరత్ గా మార్పు చేస్తే దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని సూచించారు వైవీ సుబ్బారెడ్డి.. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయి.. కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఇక, రెచ్చ గొట్టి దాడులు జరిగేలా.. యువగళంలో టి.షర్ట్ లు వేసుకుని కావాలని రెచ్చ గొడుతున్నారు.. ప్రజలు సమన్వయం పాటించాలని సూచించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి.