AP, Telangana Rain news updates: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో స్కూల్స్ కి సెలవు కలెక్టర్ సెలవు ప్రకటించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.
Read also: Heavy Rainfall: భారీ నుంచి అతి భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్
కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సోమవారం (సెప్టెంబర్ 4) తెల్లవారుజాము నుండి చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తంహ్రా ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై ప్రవాహం కొనసాగుతోంది. నదులు, రిజర్వాయర్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లాలో చెరువులు రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహంలో చిక్కుకున్న నలుగురు యువకులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
BiggBossTelugu7: బోల్డ్ ప్రశ్నలతో షకీలాని కెలికిన టేస్టీ తేజ..తప్పు చేశానని ఫీల్ అవుతున్న శివాజీ..