Leading News Portal in Telugu

Gorantla Madhav: వైఎస్ విజయమ్మను కించపరిచారు.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి


Gorantla Madhav: టీడీపీ అధినేత చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. వైఎస్ విజయమ్మ ను చంద్రబాబు కించపరిచారు.. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారు? లేదంటే ఇంకేమైనా తింటున్నారా…? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌. కాగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న విషయం విదితమే.. ఓవైపు వైసీపీ సర్కార్ పై.. మరో వైపు సీఎం వైఎస్ జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.