Chandrababu Arrest Live Updates: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.. మరో వైపు ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును, ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు చేస్తుండడంతో.. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.. నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.. రాష్ట్రంలో బంద్ వాతావరణం కనిపిస్తోంది.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి..