Leading News Portal in Telugu

Pawan Kalyan: పవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జనసైనికులపై లాఠీఛార్జ్?


AP Police Stopped Pawan Kalyan at Garikapadu Checkpost: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఆయన అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా ఆయనని కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లగా ఆయన వెళ్లే విమాననానికి అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ విజయవాడకి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వస్తున్న పవన్ కి జగ్గయ్యపేట దగ్గర జన సేన నేతలు, జనసైనికులు స్వాగతం పలికారు.

Bichagadu: ‘బిచ్చగాడు’ మళ్ళీ వస్తున్నాడు.. ఏడ్చేందుకు రెడీ అవండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటున్నారని సమాచారంతో ఆంధ్ర బోర్డర్ గరికపాడుకు చేరుకున్న జనసేన కార్యకర్తలను అదుపులో ఉంచి పవన్ ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఇక పవన్ కాన్వాయ్ ను గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జనసైనికులు-పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇక జన సైనికులు పవన్ ను అడ్డుకునే క్రమంలో తమకు అడ్డుపడుతూ ఉండడంతో వారిపై లాఠీ ఛార్జ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది. ఏపీలోకి రావాలంటే వీసా, పాస్ పోర్టు కావాలేమో అని అంటూ పవన్ మాట్లాడుతున్న మాటలను నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.
మరొక పక్క ఇదే కేసులో విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. మధ్యాహ్న నుండి రాత్రి వరకు స్టేషన్లో ఉంచి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారని తెలుస్తోంది.