నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చర్చించనుంది. వారాహి తదుపరి షెడ్యూల్ పై పీఏసీ సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోనుంది. చంద్రబాబు అరెస్టు తదనంతరం జరిగిన పరిణామాలపై, భవిష్యత్ వ్యూహాలపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు.
అయితే, అంతకు ముందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా.. ఏపీలో పోలీసులు ఆయన కాన్వాయ్ ను గరికపాడు దగ్గర అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి పవన్ కల్యాణ్ రెడీ అవ్వగా.. ఆయన ప్రయాణించాల్సిన స్పెషల్ ఫ్లైట్ ను టేకాఫ్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారని జనసేన నేతలు ఆరోపించారు.
అయితే, నేడు (ఆదివారం) మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం కోసం పవన్ శనివారం సాయంత్రం విజయవాడకు రావాల్సి ఉండటంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇవాళ జరుగనున్న పీఏసీ సమావేశంలో పాల్గొననున్నారు.