Leading News Portal in Telugu

ACB Court: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశం.


ACB Court: టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక భద్రతతో రాజమండ్రి జైలుకు తీసుకొస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ తో పాటు లోకేశ్ కూడా వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు తెలిపింది. తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది.