Leading News Portal in Telugu

Pawan Kalyan: చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో నా మద్దతు ఉంటుంది


చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు. విశాఖపట్నంలో గొడవ జరిగిన సమయంలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారని.. తిరిగి తాను స్పందించడం అనేది సంస్కారమన్నారు. తన కోసం నిలబడిన వ్యక్తికి తాను మద్దతు ఇవ్వడం మన బాధ్యతని పవన్ అన్నారు. తాను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించిందే వైసీపీ నేతలని ఆరోపించారు.

Justin Trudeau: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!

పులివెందలలోనే నీ ఫ్యాక్షనిజం చెల్లుతుంది.. ఏపీలో చెల్లదని సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రాణాలు పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలిపారు. మానభంగాలు, మర్డర్ లు చేసినవాళ్ళని కాపాడుతున్నారని ఆరోపించారు. తాను గెలవాలి అనుకుంటే తనకు చాలా దారులున్నాయన్నారు. ఫండమెంటల్ రైట్స్ కోసం తాను మాట్లాడుతున్నానని.. జనసేన బలమైన కమిట్మెంట్ తో ఉందని ప్రజల కోసం నిలబడుతుందని తెలిపారు. వారాహి నాల్గో విడత అందరిని మేల్కొల్పుతుందని పవన్ పేర్కొన్నారు. మరోవైపు జగన్ రాష్ట్రానికి మంచిది కాదని.. హానికరమని విమర్శించారు. నాలాంటోడినే రోడ్ల మీదకు రానివ్వలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Sajjala: చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలే

తాను బ్రతికుండే వరకు ఏపీలో పోరాట పటిమ పోనివ్వనని పవన్ కల్యాణ్ అన్నారు. నాకెవ్వరు ఎదురు లేరని జగన్ అనుకుంటున్నాడని.. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు తప్పుగా చూసి పెద్దాయన్ని జైలుకు పంపావని ఆరోపించారు. నిన్ను వదలం.. చూస్తూ ఊరుకోమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజును గుర్తు పెట్టుకుంటామని.. ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్నావు.. ఇక్కడున్న డబ్బులను అక్కడ దాచుకోవడానికి వెళ్ళావని ఆరోపించారు. తాను ప్రధానితో మాట్లాడి జగన్ చేసినవి కనుక్కోలేనా అన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే నిన్ను నీ అనుచరులను విచారణల చుట్టూ తిరిగేలా చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.