Leading News Portal in Telugu

Minister Roja: చంద్రబాబు అరెస్ట్ తో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు


స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ పర్యటన మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద ఒక్క కేసు పెట్టి ఆరెస్ట్ చేయాలంటే సాక్షాధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు అని ఆమె పేర్కొన్నారు. ఒక వేళ అలా చేసిన కేసు నిలబడదు అనేది అందరికి తెలుసు కాబట్టి.. ఈ రోజు ఒక కేసును నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని.. ఆ అకౌంట్లు ఎలా దారి మళ్లీంచారు.. ఎవరెవరికి వెళ్లాయి, ఎలా వెళ్లాయి అనే అన్ని విషయాలు విచారణలో చాలా పేర్లు వస్తాయని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.

సీఐడీ అధికారులు విచారణ చేస్తుండగా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి.. చాలా పేర్లు వస్తాయి.. అప్పుడు ఎవరెవరు అనేది బయటకు వస్తుందని కాబట్టి అందరిని యాడ్ చేసుకుంటు పోతారు అని ఆమె అన్నారు. అమరావతి అనేది చంద్రబాబు, లోకేశ్ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దోచుకున్నారు అనే విషయాన్ని తాము మొదటి నుంచి చెప్పుకుంటు వస్తున్నామని మంత్రి తెలిపారు.

చంద్రబాబు ప్రజల డబ్బును దోచుకుని హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టుకున్నాడని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన దానికి నేను స్పందించను అంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం జరిగిందని ఆమె అన్నారు. పురంధేశ్వరి తన తండ్రిని వెన్నుపోటు పొడిచి, చంపిన వ్యక్తికి భగవంతుడే శిక్ష వేస్తుంటే సంతోషించాల్సింది పోయి.. బీజేపీ పార్టీ ఖండిస్తుంది.. ఇది కరెక్టుగా కేసు లేదని చెప్పడం చూస్తుంటే.. అది భారతీయ జనతా పార్టీలాగా లేదు.. బావా జనతా పార్టీ లాగా ఉందని మంత్రి రోజా అన్నారు. బావాను కాపాడుకోవాడానికి ఒక పార్టీని తాకట్టు పెట్టే పురంధేశ్వరి ఏపీ రాష్ట్రాన్ని దొచుకున్న వ్యక్తికి సపోర్ట్ చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు.